ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అమలు చేస్తున్నానని చెపుతూనే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి ఎచ్ హనుమంతురావు మండిపడ్డారు .ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణలో ఉంది ప్రెండ్లీ పోలీసులు కాదని ఎనిమి పోలీసులు అని ఎద్దేవా చేశారు .కేసీఆర్ ఒటమి భయంతోనే విపక్షాలను రౌడీ షీటర్లు అంటూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు .కేసీఆర్ ప్రెండ్లీ పోలీస్ అంటూ పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా మార్చారని ఆరోపించారు .ఖమ్మంలో ఈ మధ్య కాలంలో విపక్ష పార్టీ కార్యకర్త సాయి గణేష్.పోలీసులు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపుల కారణంగానే మరణిస్తున్నా అని మరణ వాగ్మూలం ఇచ్చి మరణించాడని , తాను మరణించి 6 రోజులు అవుతున్నా సదరు పోలీసులపై , మంత్రి పువ్వాడ అజయ్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నావో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు .ఏ పార్టీ కార్యకర్త అయినా ముందు మనిషి అనే విషయం గుర్తు పెట్టుకుని మానవతా దృక్పథంతో అయినా ఈ విషయంపై స్పందించాలని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనా నడుస్తలేదని , రౌడీల డిక్టేటర్ పాలన నడుస్తోందని దూషించారు .అధికారం చేతిలో పెట్టుకుని అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు .
![Telugu Congress, Friendly Cops, Khammam, Rahul Gandhi, Sai Ganesh, Sanjeeva, Tel Telugu Congress, Friendly Cops, Khammam, Rahul Gandhi, Sai Ganesh, Sanjeeva, Tel](https://telugustop.com/wp-content/uploads/2022/04/Sai-Ganesh-Minister-Puvada-Ajay-Kumar.jpg )
రాష్ట్రంలో రైతులు , నిరుద్యోగులు , పేద ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు .8 ఏండ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విపక్షాలపై దాడులు చేయించడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు .మే 6 వ తారీఖున వరంగల్ జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు , భావి భారత ప్రధాని రాహూల్ గాంధీ రైతు సంఘర్ణ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సభను విజయంవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు , జిల్లా నాయకులకు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ , ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు , జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ , కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు , దుద్దుకూరి వెంకటేశ్వర్లు , జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సెన్ , పెండ్ర అంజయ్య , సోషల్ మీడియా కోఆర్డినేటర్ యాసిన్ , మిక్కిలినేని నరేందర్ , ఎనిగల్ల సత్యనారాయణ , బాణాల లక్ష్మణ్ , దీపక్ నాయక్ , రవికుమార్ , ఎస్డ్ హుస్సెన్ , ఎర్రబొలు శ్రీనివాస్ గశి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .