ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించలేదు..: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చర్చించలేదని ఆరోపించారు.

సభలో రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై స్పందించలేదని పేర్కొన్నారు.ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సభలో సమస్యలపై మాట్లాడకుండా తనపైనే చర్చ జరిగిందని తెలిపారు.కేసీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారని మండిపడ్డారు.

గతంలో సోనియా దయవలనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.కానీ ఇప్పుడేమో కాంగ్రెస్ వలనే తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని దుయ్యబట్టారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?
Advertisement

తాజా వార్తలు