రజినీకాంత్ జైలర్ విడుదల... కార్యాలయాలకు సెలవు ప్రకటించిన యాజమాన్యం?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) తాజాగా నటించిన చిత్రం జైలర్( Jailer ) .ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

 Rajinikanth Jailer Released The Management Announced A Holiday To The Offices, R-TeluguStop.com

నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dileep Kumar ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇలా ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో చెన్నై బెంగళూరు వంటి నగరాలలో పలు కంపెనీలు తమ కార్యాలయాలకు సెలవులను ప్రకటించారు.

Telugu Jailer, Nelsondileep, Rajinikanth, Ramya Krishna, Tollywood-Movie

ఈ విధంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే సినిమాని చూసే విధంగా తమ కంపెనీలకు సెలవు ప్రకటించడం గమనార్హం.అయితే మరికొన్ని కంపెనీలు ఏకంగా తమ ఉద్యోగులకు టికెట్లను కూడా అందజేస్తూ సినిమా చూసేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానటువంటి ఈ సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా ప్రారంభం కావడంతో హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి.

Telugu Jailer, Nelsondileep, Rajinikanth, Ramya Krishna, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో రజనీకాంత్ రమ్యకృష్ణ( Ramya Krishna ) జంటగా కనిపించబోతున్నారని సమాచారం.అయితే ఈ సినిమాలో రజనీకాంత్ ప్రేమ కథ చిత్రంలో కాకుండా తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో తమన్నా కూడా కొన్ని కీలక సన్నివేశాలలో సందడి చేయబోతున్నారు.ఇక తమన్నా నటించిన కావాలయ్యా అనే పాట ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో మనకు తెలిసిందే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.మరి ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube