ఫస్ట్‌లుక్ టాక్: తీరిగ్గా పుస్తకం చదువుతున్న వకీల్ సాబ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అలాంటిది దాదాపు రెండేళ్ల తరువాత పవన్ చిత్రం వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కొద్ది నిమిషాల క్రితం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ప్రాచుర్యంలో ఉన్న ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తీరిగ్గా కాళ్లు చాపుకుని కుర్చున్నాడు.

కళ్లకు నల్లటి అద్దాలు పెట్టుకుని చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతున్నాడు.లాయర్‌గా కనిపించే పవన్ ఏదో సీరియస్‌గా చదువుతుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్రపై అప్పుడే అంచనాలు పెరిగాయి.

Advertisement

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ఇది రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

Advertisement

తాజా వార్తలు