Prithviraj Sukumaran Prabhas : ప్రభాస్ లాంటి వాళ్ళను అసలు సాయం అడగకూడదు: పృథ్వీ రాజ్ సుకుమారన్

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకు ఉన్నటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) ఇటీవల తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈయన ప్రభాస్(Prabhas ) తో కలిసిన నటించిన సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Pruthvi Raj Sukumaran Comments Goes Viral About Prabhas-TeluguStop.com

ఈ సినిమాలో వీరిద్దరికి ఎంతో ప్రాణ స్నేహితులుగా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా తరువాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అంతే మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఇలా ప్రభాస్ తో స్నేహం గురించి పృథ్వీ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇకపోతే ఈయన మలయాళంలో నటించినటువంటి ఆడు జీవితం ( Aadujeevitham ) అనే సినిమా తెలుగులో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పృథ్వీ రాజ్ తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయనకు మీడియా వారి నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.

మీరు ప్రభాస్( Prabhas ) ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రభాస్ ని తీసుకువస్తే సరిపోయేది కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.నేను అడిగితే ప్రభాస్ నాకు నో చెప్పడు.చెప్పలేడు.అలా నో చెప్పలేని వారిని ఎప్పుడూ కూడా సాయం అడగకూడదు.అది చాలా తప్పు అంటూ ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఇదివరకు ప్రభాస్ గొప్పదనం గురించి ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube