Prithviraj Sukumaran Prabhas : ప్రభాస్ లాంటి వాళ్ళను అసలు సాయం అడగకూడదు: పృథ్వీ రాజ్ సుకుమారన్
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకు ఉన్నటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) ఇటీవల తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈయన ప్రభాస్(Prabhas ) తో కలిసిన నటించిన సలార్ ( Salaar )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో వీరిద్దరికి ఎంతో ప్రాణ స్నేహితులుగా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా తరువాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అంతే మంచి స్నేహితులుగా మారిపోయారు.
ఇలా ప్రభాస్ తో స్నేహం గురించి పృథ్వీ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు.
"""/"/
ఇకపోతే ఈయన మలయాళంలో నటించినటువంటి ఆడు జీవితం ( Aadujeevitham ) అనే సినిమా తెలుగులో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతుంది.
ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పృథ్వీ రాజ్ తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయనకు మీడియా వారి నుంచి ఒక ప్రశ్న ఎదురయింది.
"""/"/
మీరు ప్రభాస్( Prabhas ) ఎంతో మంచి స్నేహితులు ఈ సినిమా ప్రమోషన్ల కోసం ప్రభాస్ ని తీసుకువస్తే సరిపోయేది కదా అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.
నేను అడిగితే ప్రభాస్ నాకు నో చెప్పడు.చెప్పలేడు.
అలా నో చెప్పలేని వారిని ఎప్పుడూ కూడా సాయం అడగకూడదు.అది చాలా తప్పు అంటూ ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈయన ఇదివరకు ప్రభాస్ గొప్పదనం గురించి ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.