యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.కోతులాపురంలో రాజగోపాల్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును స్థానికులు అడ్డుకున్నారు.
తమ గ్రామానికి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.నిరసన జ్వాలలు చెలరేగడంతో రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.







