మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.బోడుప్పల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసేందుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డిని స్థానిక బీజేపీ మహిళలు అడ్డుకున్నారు.స్థానికంగా ఉన్న వక్ఫ్ బోర్డు సమస్యలను పరిష్కరించాలని మంత్రిని నిలదీశారు.
బీజేపీ, బీఆర్ఎస్ మహిళల మధ్య స్వల్ప వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు.







