Rajinikanth : ఈ రెండు సినిమాల విషయంలో రజిని ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది

ప్రస్తుతం రజనీకాంత్ తన జైలర్ సినిమా( Jailer ) గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.జైలర్ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ముందు అది కేవలం ఒక యావరేజ్ సినిమాగా మాత్రమే ఉందని ఇచ్చిన సంగీతం వల్లనే ఆ సినిమా స్థాయి పెరిగి హిట్ అయింది.

 Rajinikanth Comments On Jailer And Basha Movie-TeluguStop.com

అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.నిజానికి జైలర్ సినిమా పూర్తిగా అనిరుద్ గొప్పతనం ఏమీ కాదు.

ఈ సినిమా విజయానికి మూడు కారణాలు ఉన్నాయి.దర్శకుడు నెల్సన్ అద్భుతమైన టేకింగ్, అందుకు తగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ ఇవ్వడం, అలాగే రజనీకాంత్( Rajinikanth ) మేనియా.

Telugu Baashha, Jailer, Kollywood, Rajinikanth, Tamannaah, Tollywood-Telugu Top

ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా ఆ సినిమా విజయం సాధించేది కాదు అయితే రజనీకాంత్ ఇలా బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లనే సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పడం కొత్తేమీ కాదు.ఇంతకు ముందు భాషా సినిమా విడుదల సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.ఈ సినిమాకు సైతం సంగీత దర్శకుడు దేవా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం వల్లే విజయం సాధించిందని లేకపోతే భాషా సైతం ఒక యావరేజ్ సినిమా అని రజనీకాంత్( Rajinikanth ) వ్యాఖ్యలు చేశారు.ఇలా జైలర్ మరియు భాషా( Baashha ) సినిమాల విషయంలో దర్శకులను అవమానిస్తూ సంగీత దర్శకులను నెత్తిన పెట్టుకోవడంతో ఒక వర్గం ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.

Telugu Baashha, Jailer, Kollywood, Rajinikanth, Tamannaah, Tollywood-Telugu Top

అయితే ఇన్ని సినిమాల్లో నటించిన ఆ రజినీకాంత్ కథ వినే సమయంలో ఏం చేస్తున్నారు సాధారణ కథలు ఎంచుకోవడం ఆ తర్వాత దర్శకుడికి కాకుండా మరొకరికి ఆ క్రెడిట్ ఇవ్వడం ఏంటి అంటూ అతనిపై విరుచుకుపడుతున్న ప్రేక్షకులు లేకపోలేదు.కానీ సినిమా కథలు అన్నీ కూడా గొప్పవేమి కాదు ఇండస్ట్రీలో చాలా తక్కువ కథలు ఉన్నాయి.ఉన్న కథను అటు ఇటు తిప్పి సినిమా తీస్తున్నా ఈ కాలంలో నెల్సన్( Nelson Dilipkumar ) కూడా గొప్ప సినిమానే తీశాడు అంటూ మరొక వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు.ఏది ఏమైనా రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు యావత్ సౌత్ ఇండియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube