మరోసారి త్రివిక్రమ్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్న మహేష్ ఫ్యాన్స్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌( Trivikram ) అల వైకుంఠపురం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు త్రివిక్రమ్ నుండి సినిమా రాలేదు.

 Mahesh Babu Fans Unhappy With Trivikram Issue Details, Mahesh Babu , Trivikram,-TeluguStop.com

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సమ్మర్ లో మహేష్ బాబు తో( Mahesh Babu ) రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) వచ్చేది.కానీ మహేష్ బాబు ఫ్యామిలీ లో విషాదం చోటు చేసుకోవడం తో పాటు పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు మహేష్ బాబు బిజీ బిజీగా గుంటూరు కారం సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.వరుసగా సినిమాలు చేసే ఉద్దేశ్యంతో మహేష్ బాబు డేట్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Guntur Karam, Gunturu Karam, Mahesh Babu, Telugu, Trivikrammahesh, Trivir

మహేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో సినిమా ను సంక్రాంతికి( Sankranti ) విడుదల చేయాలనే పట్టుదలతో రోజు 12 గంటలకు పైగా వర్క్ చేస్తున్నాడట.ఇక తాజాగా వినాయక చవితి ( Vinayaka Chavithi ) నేపథ్యం లో గుంటూరు కారం సినిమా కి సంబంధించిన పాట లేదా ఏదైనా స్పెషల్‌ వీడియో వస్తుందని అంతా భావించారు.ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు లక్షల కళ్లు పెట్టుకుని ఎదురు చూశారు.తీరా పండుగ రోజు నిరాశ పరుస్తూ ఎలాంటి అప్డేట్ ను అభిమానులకు ఇవ్వలేదు.దాంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Guntur Karam, Gunturu Karam, Mahesh Babu, Telugu, Trivikrammahesh, Trivir

అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా త్రివిక్రమ్‌ వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే కొందరు మాత్రం త్రివిక్రమ్‌ ప్రస్తుతం సినిమా ను డిసెంబర్‌ వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే ఇతర పనులు ఏమీ పెట్టుకోకుండా షూటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పండుగకి స్పెషల్‌ వీడియో రాకున్నా కూడా కచ్చితంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే విధంగా ఫ్యాన్స్ భారీ ఎత్తున అంచనాలు పెట్టుకునే విధంగా విడుదల సమయంలో ప్రమోషన్స్ ఉంటాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube