అల్లం పంటను ఆశించే ఆకు మచ్చ తెగుళ్లను నివారించే యాజమాన్య పద్ధతులు..!

అల్లం పంట( Ginger crop)ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే ఆకుమచ్చ తెగులు ఒక శిలీంద్రం ద్వారా పంటను ఆశిస్తుంది.

మట్టిలో ఉండే మొక్కల అవశేషాల్లో ఉండే బీజాంశం ద్వారా ప్రాథమిక సంక్రమణ సంభవిస్తుంది.

ద్వితీయ సంక్రమణకు గాలి, వర్షపు తుంపర్లు కారణం అవుతాయి.వాతావరణం లో అధిక తేమ లేదంటే అధిక ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగుళ్ల వ్యాప్తి ఉధృతంగా ఉంటుంది.

రెండు వారాల పంట తెగుళ్ల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ.

అల్లం మొక్క లేత ఆకులపై నీటిలో తడిచిన మచ్చలు కనిపిస్తే ఈ ఆకు మచ్చ తెగుళ్లు సొకినట్టే.ఈ మచ్చలు పసుపు రంగు వలయంలో ఏర్పడి మధ్యలో తెల్లని మచ్చలుగా మారుతాయి.ఈ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటే మొక్కలు ఎండిపోయి చనిపోతాయి.

Advertisement

తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉండాలంటే మద్యస్థ నిరోధక రకాలను ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.ఈ తెగుళ్లు సోకిన మొక్కల ఆకులను తుంచి నాశనం చేయాలి.

మొక్కలో ఎక్కువ భాగం ఈ తెగులు ఆశించినట్లయితే ఆ మొక్కనే వేర్లతో సహా తొలగించి నాశనం చేయాలి.ఈ తెగుళ్లు మళ్లీ రాకుండా పంట మార్పిడి చేస్తుంది.

ఈ తెగులను సేంద్రియ పద్ధతి( Organic method )లో పూర్తిగా అరికట్టేందుకు సరైన యాజమాన్య పద్ధతులు అందుబాటులో లేవు.కాబట్టి రసాయన పిచికారి మందులను ఉపయోగించి ఈ తెగుళ్లను అరికట్టాలి.ఆకుమచ్చ తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటే బోర్డియక్స్( Bordeaux ) మిశ్రమం లేదా ప్రాపికొనజోల్ (0.1%) లను పిచికారి చేయాలి.ఒకవేళ తెగుల వ్యాప్తి అధికంగా ఉంటే.మాంకోజెబ్ మిశ్రమం+ కార్బెండిజమ్ ను పిచికారి చేయాలి.20 రోజుల వ్యవధిలో రెండుసార్లు అల్లం ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే ఈ తెగులను పూర్తిగా అరికట్టవచ్చు.

అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరంపై జెండా పాతిన ఎన్ఆర్ఐ జంట
Advertisement

తాజా వార్తలు