సాధారణంగా కొన్ని బంధాలు ఎంత కలపాలని చూసినా అవి కలవవు.కొన్ని అనుబంధాలు మాత్రం విడదీద్దాం అని ట్రై చేసినా అంతిమంగా కలుస్తాయి.
ఇలాంటి ఆశ్చర్యపరిచే సంఘటనలు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.నిజ జీవితాల్లో మాత్రం ఈ ఘటనలు అరుదుగానే జరుగుతాయని చెప్పాలి.
అలాంటి ఒక అరుదైన ఘటన తాజాగా జార్జియాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే, అమీ, అనో( Amy, ano ) ఇద్దరూ కవలలుగా పుట్టారు.
వారు ఒకే తల్లి కడుపున పుట్టిన కవలలే అయినా వారికి ఆ సంగతి 2021 వరకు తెలియదు.వారు 2002లో జార్జియాలోని ( Georgia )ఒక ఆసుపత్రిలో జన్మించారు.
అయితే వారిని కొందరు దుండగులు తల్లి నుంచి అపహరించి వేర్వేరు కుటుంబాలకు విక్రయించారు.వీరినొక్కరినే కాదు జార్జియాలో చాలా మంది పసిపిల్లలను ఇలానే కొంతమంది నేరగాళ్లు అమ్మేశారు.
అమీ తన 12 ఏళ్ల వయస్సులో తన ట్విన్ సిస్టర్ అనోను ఒక టీవీ షోలో చూసింది.అనో తన కాపీ అనుకుంది.ఇది కేవలం యాదృచ్చికమేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.అమీ అనోను మరిచిపోలేదు.2021లో అమీ టిక్‌టాక్‌లో ఒక వీడియో చేసింది.అనో ఆ వీడియో చూసి అమీ తనలాగే ఉందనుకుంది.
ఆమె అమీని కనుగొనాలనుకుంది.ఆన్‌లైన్‌లో తన స్నేహితులకు అమీ తెలుసా అని అడిగింది.
వారిలో ఒకరు అనో గురించి అమీకి చెప్పాడు.చివరికి ఒకరినొకరు కలవాలని నిర్ణయించుకున్నారు.
అంతే కాదు, దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ కవల సిస్టర్స్ కలుసుకున్నారు, ఇద్దరు సేమ్ ఉండటంతో ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు.వారికి ఒకే ముఖం, ఒకే వాయిస్ ఉంది.
వారు కలుసుకున్నప్పుడు తమ గురించి మాట్లాడుకున్నారు, ఇద్దరిలో కామన్ థింగ్స్ చాలానే ఉన్నాయని కనుగొన్నారు.ఆపై వారి గతం గురించి వారి కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు.
దత్తత తీసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.అసలు తల్లిదండ్రుల గురించి లేదా తన కవల సోదరి ఉన్నారనే విషయం ఈ ట్విన్ సిస్టర్స్ కు 19 ఏళ్ల దాకా తెలియదు.
ఈ పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలా డబ్బు చెల్లించామని దత్తత కుటుంబ సభ్యులు తెలిపారు.

అమీ మరిన్ని సమాధానాల కోసం ఆన్‌లైన్‌లో శోధించింది.జార్జియాలో దత్తత తీసుకున్న వ్యక్తుల కోసం ఆమె ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరింది.ఆమెకు జర్మనీకి చెందిన అజా ( aja )అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
అమీ, అనో ఉన్న ఆసుపత్రిలోనే తన తల్లికి కూడా కవలలు పుట్టారని అజా అనే ఒక మహిళ చెప్పింది.అయితే ఆ కవలలు చనిపోయారని ఆసుపత్రి తెలిపిందట.
కానీ తన పిల్లలు సజీవంగానే ఉండవచ్చని అజా తల్లి భావించిందట.

అయితే ఆ తల్లి కన్నది తమనే అని ట్విన్ సిస్టర్స్ ఫీలయ్యారు.అందుకే అమీ, అనో ట్విన్ సిస్టర్స్ కలిసి అజాతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నారు.పరీక్షలో వారు ముగ్గురు కూడా సోదరీమణులు అని తేలింది.
అంతే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ కవలలు తమ తల్లి, సోదరీమణి అజాను కలవడానికి జర్మనీకి వెళ్లారు.
వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి సంతోషించింది.వారు పుట్టినప్పుడు తాను కోమాలో ఉన్నానని చెప్పింది.
ఆసుపత్రి వారు పిల్లలు చనిపోయారని ఆమెకు అబద్ధం చెప్పారట.చివరికి అందరూ కలవడంతో వీరి కథ హ్యాపీగా ఎండ్ అయ్యింది.
ఈ కుటుంబ సభ్యులు కౌగిలించుకొని ఏడ్చారు.







