బొప్పాయిలో ( papaya )పోషక విలువలు చాలా ఎక్కువ.బొప్పాయి కేవలం పండుగనే కాకుండా బొప్పాయి చెట్లనుండి పాలను సేకరించి పపెయిన్ అనే ఎంజైమ్ ను తయారుచేస్తారు.
కాబట్టి బొప్పాయి పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.సరైన యాజమాన్య పద్ధతులు తెలుసుకొని పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.
బొప్పాయి పంట సాగు చేపట్టిన తొమ్మిది నెలల నుంచి రెండేళ్ల వరకు కాపు ఇస్తుంది.
బొప్పాయి పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద( pests ) కాస్త ఎక్కువ.
కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ, పంటను సంరక్షించుకోవాలి.బొప్పాయి పంటకు ఈగల బెడద చాలా ఎక్కువ.
బొప్పాయి కాయ పక్వానికి వచ్చే దిశలో ఈగలు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.బొప్పాయి తోట పరిశుభ్రంగా ఉంటే ఈగల( house flies ) సమస్య చాలా తక్కువగా ఉంటుంది.
ఇక ఈగల నివారణ కోసం మిథైల్ యూజినల్( Methyl eugenal ) ఎర బుట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచి ఈగలను ఆకర్షించేలా చేయాలి.బుట్టలలో చిక్కిన ఈగలను నాశనం చేయాలి.

బొప్పాయి పంటకు పిండినల్లి పురుగుల బెడద( Pindinalli pest ) కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.బొప్పాయి కాయల నుండి ఈ పిండి నల్లి పురుగులు పూర్తిగా రసాన్ని పీల్చడం వల్ల కాయల రంగు మారిపోతుంది.ఈ పురుగులను తోటలో గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల ప్రోఫినోఫాస్ ను కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

బొప్పాయి తోటలో మొక్కల మధ్య కాస్త అధిక దూరం ఉంటే సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.మొక్క చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే వివిధ రకాల చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది.సరైన యాజమాన్య పద్ధతులపై అవగాహన ఉంటే ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశించకుండా సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు.