ఉసిరి సాగులో అధిక దిగుబడి కోసం సరైన యాజమాన్య పద్ధతులు..!

ఉసిరి పంటను( Amla crop ) సాగు చేయాలనుకుంటే ముందుగా పంట సాగు విధానంపై అవగాహన ఉండాలి.అవగాహన ఉంటేనే అధిక దిగుబడులు సాధించవచ్చు.

ఉసిరి పంట సాగుకు నీరు నిల్వ ఉండని నేలలు తప్ప మిగతా నేలలన్నీ అనుకూలంగా ఉంటాయి.నేలలో ఆమ్లా, క్షార లక్షణాలు ఉన్న, పీహెచ్ విలువ 9.5 వరకు ఉండే నేలలలో కూడా ఉసిరి పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చు.ప్రస్తుతం మార్కెట్లో చాలా ఉసిరి రకాలు ఉన్నాయి.

సాగుకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి.భవాని సాగర్, చకియా, కృష్ణ, ఫ్రాన్సిస్, బెనారసి, N.A7 రకాలలో ఏదో ఒక రకం సాగుకు ఎంపిక చేసుకుని సాగు చేయాలి.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 160 ఉసిరి మొక్కలు నాటుకోవాలి.మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య 15 అడుగుల దూరం ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి.మొక్కలు నాటే విధానం: 50 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వెడల్పు, 50 సెంటీమీటర్ల లోతు ఉండేటట్లు గోతులు తొవ్వుకోవాలి.ఈ గుంతలలో 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల ఎండో సల్ఫాన్ పొడి( Endo sulfon powder ) కలిపి గుంతలో వేయాలి.

Advertisement

తర్వాత ఉసిరి మొక్కలను ఈ గుంతలలో నాటాలి.

మొక్కల అవసరాన్ని బట్టి సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించాలి.మొక్కల వయసు 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటే ఒక మొక్కకు ఒక కిలో భాస్వరం, 1.5 కిలోల నత్రజని, 500 గ్రాముల పొటాష్ ఎరువులు అందించాలి.ఉసిరి చెట్టు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.అయితే నీటిని అందిస్తే మొక్కలు ఆరోగ్యకరంగా బాగా పెరుగుతాయి.

నాటిన మొదటి మూడు సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ ఉండాలి.వేసవికాలంలో వారానికి ఒకసారి తప్పనిసరిగా నీటిని అందించాలి.

ఈ పద్ధతులు పాటిస్తే ఉసిరి చెట్లు ఆరోగ్యకరంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తాయి.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?
Advertisement

తాజా వార్తలు