టి.కాంగ్రెస్ వ్యూహకర్తకు ప్రమోషన్ .. మరిన్ని బాధ్యతలు 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో చాలామంది చాలా వ్యూహాలనే అమలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు, ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు( Sunil Kanugolu ) వ్యూహాలు కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టాయి.

 Promotion To T.congress Strategist Sunil Kanugolu More Responsibilities , Suni-TeluguStop.com

దీంతో సునీల్ ప్రాధాన్యం మరింతగా కాంగ్రెస్ లో పెరిగింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సునీల్ వ్యూహాలు బాగా పనిచేశాయి.

తెలంగాణలోనూ ఆ వ్యూహాలు పనిచేయడంతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద సునీల్ కానుగోలుకు మరింతగా ప్రాధాన్యం పెరిగింది.

Telugu Lok Sabha, Aicc, Loksabha, Pcc, Revanth Reddy, Sunil Kanugolu, Telangana-

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ అధిష్టానం, సునీల్ కానుగోలుకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతోంది.లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు వ్యూహాలు అందించడంతో పాటు, సోషల్ మీడియా బాధ్యతలను సునీల్ కానుగోలుకు  అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Telugu Lok Sabha, Aicc, Loksabha, Pcc, Revanth Reddy, Sunil Kanugolu, Telangana-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఊహించిన స్థాయిలో మద్దతు రావడానికి కారణం ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు.ఈ పథకాలను జనాలకు అర్థమయ్యేలా చేయడంలో సునీల్ టీం సక్సెస్ అయ్యింది దీంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు బాగా పనిచేశాయి.ఇవన్నీ సునీల్ వ్యూహాలే కావడంతో సభ ఎన్నికల్లోను సునీల్ సేవలను ఉపయోగించుకుని బీజేపి కి గట్టి దెబ్బ కొట్టాలి అనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది.లోక్ సభ ఎన్నికలతో పాటు, హర్యానాలో పార్టీ ప్రచార వ్యూహాలను అందించే బాధ్యత కూడా సునీల్ కు అప్పగించనునట్లు సమాచారం.2024 లోక్ సభ ఎన్నికల్లో( 2024 Lok Sabha Elections ) పార్టీ ప్రచార వ్యూహాలను అమలు చేసేందుకు సునీల్ కానుగోలు ప్రత్యేకంగా వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube