ప్రొఫెసర్ విశ్వామిత్ర గా డా. మంచు మోహన్ బాబు

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’.

 Professor Vishwamitra As Dr. Manchu Mohan Babu , Dr. Manchu Mohan Babu, Manchu L-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడం జరిగింది.తాజాగా ఈ రోజు (31.7.2022) డా.మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నారు మోహన్ బాబు.

ప్రొఫెసర్ విశ్వామిత్ర క్యారెక్టరైజేషన్ డిటైల్స్ లోకి వెళితే.తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల… డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్ మరియు ప్రొఫెసర్.

గంభీరమైన లుక్ తో మోహన్ బాబు గారు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని లుక్ ని చూస్తే అర్ధమవుతోంది.ఫస్ట్ టైమ్ డా.

మోహన్ బాబు, ఎవర్ ఛార్మింగ్ మంచు లక్ష్మీప్రసన్న కలిసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర చేస్తున్నారు.మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా నటిస్తున్నారు.

చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్య పాత్రలో, విశ్వంత్ కథా నాయకుడిగా, జబర్దస్త్ మహేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube