రా మూవీగా ‘పలాస 1978’ను రూపొందించి ప్రేక్షకులే కాదు.విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు కరుణ కుమార్.
ఆ తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించారు దర్శకుడు కరుణ కుమార్.ఇప్పుడు కామెడీ డ్రామా ‘కళాపురం’ చిత్రంతో అలరించటానికి సిద్ధమయ్యారు.
జీ స్టూడియోస్‌సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు.సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు.
కరుణ కుమార్ గత రెండు చిత్రాలకు భిన్నంగా కళాపురం సినిమాను రూపొందిస్తున్నారు.ఈ ఊరిలో అందరూ కళాకారులే అనేది సినిమా క్యాప్షన్.
‘కళాపురం’ ఫస్ట్ లుక్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఫస్ట్ లుక్ గమనిస్తే.
సినిమాలో ప్రధాన పాత్రధారులందరూ కనిపిస్తున్నారు.అన్నీ పాత్రలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.
సిట్యువేషనల్ కామెడీతో ప్రేక్షకులను అలరించటానికి టాలెంటెడ్ డైరెక్టర్ కరుణ కుమార్ సిద్ధమవుతున్నారు.ఈ సినిమాను ఆగస్ట్ 26న విడుదల చేస్తున్నారు.
మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.







