కుళ్లిపోయిన బంగాళదుంపల గ్యాస్ వల్ల చనిపోయిన ప్రొఫెసర్‌..

రష్యాలోని( Russia) ఐదుగురు సభ్యుల కుటుంబం తెలియకుండా చేసిన ఒక తప్పు వల్ల మృత్తి వాతపడ్డారు.వారు శీతాకాలం కోసం తమ సెల్లార్‌లో బంగాళాదుంపలు స్టోర్ చేశారు.

 Professor Died Due To The Gas Of Rotten Potatoes, Toxic Gas, Rotten Potatoes, Ce-TeluguStop.com

కుళ్ళిన ఆ ఆలుగడ్డలు చివరికి విషపూరిత వాయువు విడుదల చేయడం ప్రారంభించాయి.ఆ వాయువును పీల్చిన కుటుంబ సభ్యులలో ఒకరి తప్ప మిగతా వారంతా చనిపోయారు.

మారియా చెలిషెవా అనే ఎనిమిదేళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, అమ్మమ్మను కోల్పోయి అనాథగా మారింది.ఆమె బంధువులు ఇప్పుడు ఆమెను చూసుకుంటున్నారు.

మొదటి మృతులు ఆమె తండ్రి మిఖాయిల్ చెలిషెవ్,( Mikhail Chelyshev ) ఆయన 42 ఏళ్ల న్యాయశాస్త్ర ప్రొఫెసర్.అతను ప్రమాదం గురించి తెలుసుకోకుండా కొన్ని బంగాళాదుంపలను తీసుకురావడానికి సెల్లార్‌లోకి వెళ్లాడు.

గ్యాస్‌ బారిన పడి చనిపోయాడు.అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య అనస్తాసియా( Anastasia ) (38) ఆందోళన చెంది సెల్లార్‌లోకి అతనిని అనుసరించింది.

ఆమె కూడా గ్యాస్‌ పీల్చి చనిపోయింది.

Telugu Cellar, Gas, Laishevo, Rotten Potatoes, Russian, Tatarstan, Toxic Gas-Lat

వారి కుమారుడు, జార్జి( George ), 18, వారిని వెతకడానికి వెళ్ళాడు, కానీ అతను కూడా అదే విధిని ఎదుర్కొన్నాడు.గ్యాస్‌ విషం లాగా అతడి బాడీ లోకి చొరబడగా ఆయన చనిపోయాడు.అనస్తాసియా తల్లి, ఇరైడా, ఏదో తప్పు జరిగిందని గ్రహించి, సహాయం కోసం పొరుగువారిని పిలిచింది.

అయితే, సహాయం రాకముందే సెల్లార్‌లోకి వెళ్లి ఆమె ఘోరమైన తప్పు చేసింది.ఆమె కూడా గ్యాస్‌ కారణంగా మరణించింది.

Telugu Cellar, Gas, Laishevo, Rotten Potatoes, Russian, Tatarstan, Toxic Gas-Lat

వోల్గా నదిపై రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ టాటర్‌స్తాన్‌లోని కజాన్ సమీపంలోని లైషెవోలో ఈ సంఘటన జరిగింది.స్థానిక పరిశోధకుడు మాట్లాడుతూ, “బాగా కుళ్ళిన బంగాళాదుంపల ఫలితంగా నేలమాళిగలో పేరుకుపోయిన గ్యాస్ పాయిజనింగ్ కారణంగా వారందరూ మరణించారు.” అని అన్నారు.అయితే ఈ దురదృష్టకర సంఘటన చాలామందిని కలిచి వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube