తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఫ్లాప్ సినిమాల వల్ల నష్టపోయిన పంపిణి దారులు థియేటర్ యజమానులను కాపాడాలి అని తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభ్యర్థించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పంపినదారులు ఎగ్జిబిటర్ల తరపున నిర్మాత నట్టి కుమార్( Natti kumar ) వకాల్తా పుచ్చుకున్నారు.
మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ ( Vijaydevarakonda )నటించిన ఫ్లాప్ సినిమాలపై ప్రస్తుతం ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి.నష్టాల రికవరీ కోసం పంపిణీవర్గాలు కోర్టుకెక్కుతాయని కూడా నట్టి ఈ సందర్భంగా మీడియాలో ముందు తెలిపారు.
కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ( Kushi )పంపిణీదారులు దారుణంగా నష్టపోయారు.

నష్టపోయిన పంపిణీదారులకు డబ్బులు వెనక్కి ఇవ్వండి.అలాగే లైగర్, డియర్ కామ్రేడ్ ఇలా ఫ్లాపుల సినిమాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి ఆ నష్టాలను భర్తీ చేయండి.ముందు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోండి.
వాళ్లు లేకపోతే హీరోలు లేనే లేరు.హీరో విజయ్ దేవరకొండ దీనిని గమనించి స్పందించాలి అని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత నటి కుమార్ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో సూటిగా దేవరకొండను ప్రశ్నించారు.విజయ్ దేవరకొండ ఉన్నాడా లేడా? ప్లాప్ అయ్యాక బాధ్యత తీసుకోవాలి కదా? సినిమాలో నటించాడు.మధ్యలో వెళ్లిపోలేదు.రెమ్యునరేషన్ తీసుకున్నాడా లేదా? అతడికే తెలియాలి.లైగర్ దెబ్బ తిన్నందుకు విజయ్ పూరి కాంబినేషన్ మళ్లీ సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వొచ్చు కదా?

నష్టాల రికవరీకి సహకరించాలి కదా? అని కూడా వ్యాఖ్యానించారు.హీరోగారు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి వెనక్కి డబ్బులు ఇవ్వాలి.ఖుషి విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ కి మూడు కోట్లు నష్టం వచ్చింది.వారి కష్టం పరిశీలించండి.
ఈ విషయం విజయ్ దేవరకొండకు చెబుతున్నాను అంటూ గట్టిగానే గలాన్ని వినిపించారు.చిరంజీవి( Chiranjeevi ) గారిని అభ్యర్థిస్తున్నాను.
సార్ మీరు తీసిన సినిమాలకు నష్టం వస్తే, తిరిగి డబ్బు వెనక్కి ఇచ్చేశారు.ఇప్పుడు ఇండస్ట్రీలో పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు కష్టం వచ్చింది.
ఇది ఇంకా సాగకుండా ఆపాలి.పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల నష్టాలను తిరిగి రికవరీ చేసేందుకు మీరు సహకరించాలి అని నట్టి అన్నారు.
మరి నిర్మాత నట్టి కుమార్ ఆవేదన పై విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.