మాదాల రవి… తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత.తండ్రి మాదాల రంగారావు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన రవి, నేను సైతం అనే చిత్రం ద్వారా హీరో అయ్యారు.
చిన్నప్పటి నుంచి ప్రజా నాట్యమండలితో అనుబంధం ఉన్న మాదాల రవి, తండ్రి ఆదర్శాలను భుజాన ఎత్తుకొని ప్రజా పోరాటాల్లో పాలు పంచుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, తనను డబ్బు కోసం ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ చేశారని ప్రముఖ నిర్మాత మాదాల రవి అన్నారు.
తనకు నోటీసులు ఇవ్వకపోయినా తాను పోలీస్ స్టేషన్‌కి వెళ్లానని, ఆ తర్వాత అది కోర్టు వరకు వెళ్లిందని ఆయన అన్నారు.అంతా అయిపోయాక ఇంటికొచ్చాక కూడా అది ఇంకా మైండ్‌లో తిరుగుతూనే ఉందని, నెట్‌లో అప్పటికే తన పేరు వైరల్ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే తాను ఇప్పటివరకూ ఎవరికీ ఏ హానీ చేయలేదన్న మాదాల రవి, ఆ విషయంలో ఇప్పటికీ తన తండ్రి బాటలోనే నడుస్తున్నానని ఆయన చెప్పారు.వీలైనంత వరకు ఇంకొకరికి సహాయం చేయడానికే ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.వీలు కాలేదన్న మాట కూడా చాలా తక్కు వ సందర్భాల్లో జరుగుతుందని ఆయన చెప్పారు.
తాను టాక్ షోల్లో ఉండడం, ఇలా అన్నింటిలోనూ తాను ఉండడం ఆ సందర్భంలో ఎవరో ఒకరు అలా బురద చల్లడానికి ప్రయత్నించారని ఆయన చెప్పారు.
టాక్ షోల్లో అడిగే ప్రశ్నలు కూడా చాలా సూటిగా ఉంటాయి.కాబట్టి అలా చేసి ఉంటారని ఆయన అన్నారు.ఓ పిచ్చోడు మన ఇంటిపై రాయి వేస్తే చూసే వాళ్లు చూసి వదిలేస్తారు.కానీ కొందరు మాత్రం అసలు వాడు రాయి ఎందుకు వేశాడనే దాని గురించి ఆలోచిస్తారని ఆయన అన్నారు.
ప్రస్తుత సమాజం అలా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.