తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు.అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ విధంగా అల్లు అరవింద్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈయన బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాణ సంస్థల గురించి ఈయన పలువు విషయాలను తెలిపారు.
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని ఎంపిక చేసే పూర్తి బాధ్యతలు నిర్మాతలకు ఉండేదని తెలిపారు.ఒక కథను ఎంపిక చేసే దగ్గర నుంచి మొదలుకొని ఆ సినిమాకి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని కూడా నిర్మాతలు ఎంపిక చేసుకునేవారని, మేమందరం కూడా ఇలాగే హీరోలను దర్శకులను ఎంపిక చేసుకున్నామని తెలిపారు.
ఇక ప్రస్తుతం రోజులు మారాయి ఒక కథ ఫైనల్ అయిన తర్వాత ఆ కథకు దర్శకుడు ఎవరు ఏ నిర్మాణ సంస్థలో సినిమా చేయాలి అనేది కూడా హీరోలే నిర్ణయిస్తున్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరూ బాగా ముదిరిపోయారని ఇందుకు మెగా హీరోలు కూడా మినహాయింపు కాదని అరవింద్ తెలియ చేశారు.ప్రస్తుతం అరవింద్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన సినిమాల గురించి అలాగే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు.