బండ్ల గణేష్ మళ్ళీ సినిమాలు చేయగలను అని నమ్ముతున్నాడా?

నటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం మరియు స్నేహం తో నిర్మాతగా మారాడు.

అయితే పవన్ ఇచ్చిన అవకాశాన్ని బండ్ల గణేష్ వినియోగించుకోలేక పోయాడు.

వరుసగా భారీ సినిమాలు అంటూ చేసి చేతులు కాల్చుకున్నాడు.కథ విషయంలో పట్టింపు లేకుండా కేవలం స్టార్స్ పై నమ్మకం తో సినిమాను నిర్మించాడు.

దాంతో బండ్ల బాబు కనిపించకుండా పోయాడు.నిర్మాతగా బండ్ల గణేష్ మళ్ళీ వచ్చే అవకాశం తక్కువే అంటూ చాలా మంది అంటున్నారు.

ఈ సమయంలోనే ఆయన మాత్రం మళ్ళీ తాను నిర్మాతగా బిజీ అవుతాను అనే నమ్మకం తో ఉన్నాడు.ఆర్ధికంగా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నా కూడా త్వరలోనే మళ్ళీ పవన్ లాంటి వాళ్ళను పట్టుకుని బండ్ల గణేష్ నిర్మాతగా బిజీ అవుతానని భావిస్తున్నాడట.

Advertisement

గత కొన్ని రోజులుగా బండ్ల గణేష్ కు హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ విషయంలో గొడవ జరుగుతోంది.ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్తా సీరియస్ గానే సాగుతోంది.ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.

తాను నిర్మాతగా బిజీ అయితే హరీష్ శంకర్ కు అసలు ఛాన్స్ ఇవ్వను.అలాంటి విశ్వాసం లేని వారితో మళ్ళీ పని చేయాలనుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

తాజా వార్తలు