బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ( Priyanka Jain ) ఒకరు.ఈమె స్టార్ మాలో పలు సీరియల్స్ లో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు.ఈ కార్యక్రమంలో ఈమె ఎక్కువగా అమర్, శోభా శెట్టితోనే ( Shobha Shetty )చనువుగా ఉండేవారు అనంతరం బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో ఫిజికల్ టాస్కులలో చివరి వరకు పోరాడుతూ తనని తాను నిరూపించుకున్నారు.
ఇలా పెద్ద ఎత్తున ఈమె ఆట ఆడుతూ టాప్ ఫైవ్ వరకు చేరుకున్నారు.

ఇలా టాప్ పైవ్ వరకు వచ్చినటువంటి ప్రియాంక టైటిల్ మాత్రం గెలవలేకపోయారు.తనకంటే ముందుగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఈమె టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు రావాల్సి వచ్చింది.ఇక బిగ్ బాస్ అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన బిగ్ బాస్ జర్నీ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.నాకు ముందు నుంచి శోభ అమర్( Shobha Amar )బాగా తెలుసు కాబట్టి వారితో చనువుగా ఉన్నానే తప్ప నేను ఎవరో ఏదో ఇస్తారని వారి నుంచి ఏది ఆశించి మాట్లాడలేదని తెలిపారు.

ఇక హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాను తప్ప ఎవరి మెప్పు పొందడం కోసం నేను అలా చేయలేదని తెలిపారు.నా వంతు నేను కష్టపడుతూ టాప్ 5 వరకు చేరుకున్నానని అయితే చివరి వరకు వెళ్లి వెనక్కి వచ్చానన్న బాధ ఉందని తెలిపారు.నా వరకు నేను అక్కడి వరకు వెళ్లడం కూడా చాలా గ్రేట్ అని, అక్కడి వరకు తీసుకెళ్లినటువంటి అభిమానులకు కూడా ఈ సందర్భంగా ఈమె కృతజ్ఞతలు తెలిపారు.ఇక బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బు నేను తీసుకోకపోవడానికి అభిమానులు నాపై పెట్టుకున్న నమ్మకమే కారణమని తెలిపారు.
నేను గెలుస్తానని నన్ను అంతవరకు తీసుకువెళ్లారు.ఆ క్షణం నేను డబ్బు తీసుకొని వస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేసిన దాన్ని అవుతాను అందుకే ఆ డబ్బు తీసుకోలేదు అంటూ ఈ సందర్భంగా ప్రియాంక ( Priyanka Jain )చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







