సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుంది హీరోలందరూ కూడా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ( Nagarjuna )వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఇప్పటికి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నాగార్జున బాలయ్య ఇద్దరు కూడా మంచి స్నేహితులే అయినప్పటికీ వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవని తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసిన నాగార్జున బాలకృష్ణ ఒకే చోట కనిపించరు నాగార్జునకు సంబంధించిన వేడుకలకు బాలయ్య దూరంగా ఉంటారు.అలాగే బాలకృష్ణ వేడుకలకు కూడా నాగార్జున పూర్తిగా దూరంగా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.

ఇలా నాగార్జున బాలకృష్ణ మధ్య మాటలు లేకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలపై ఎంతోమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే సీనియర్ ఎన్టీఆర్ ( Sr Ntr ) కారణంగానే బాలకృష్ణతో నాగార్జున మాట్లాడటం లేదని తన తండ్రి కారణంగానే ఈయన బాలకృష్ణని కూడా దూరం పెట్టాలని తెలుస్తుంది బాలయ్యను దూరం పెట్టే అంత తప్పు ఎన్టీఆర్ ఏం చేసారు అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగార్జున నటించిన ఒక సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుందట.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాని నేషనల్ అవార్డ్స్ జ్యూరీకి( National Awards Jury ) పంపించాలని ఆ సినిమా చిత్ర బృందం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేశారట కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ గారు నాగార్జున నటించినటువంటి ఈ సినిమాని జాతీయ అవార్డుల జ్యూరీకి పంపించలేదని తెలుస్తుంది ఇలా పంపించకపోవడంతోనే ఆయన నటించిన ఒక గొప్ప సినిమాకు అవార్డు అందుకోలేక పోయారు.ఈ విధంగా ఎన్.టి.రామారావు గారు తన సినిమా విషయంలో వ్యవహరించిన సైలి కారణంగా నాగార్జున కూడా బాలయ్యతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ జ్యూరీకి పంపించకపోవడానికి కారణం ఎన్టీఆర్ ఏఎన్నార్ మధ్య జరిగిన గొడవ కారణమని తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగానే ఎన్టీఆర్ నాగార్జున సినిమా విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించారని తెలుస్తుంది.








