ప్రియమణి కెరీర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్..పడి లేసిన కెరటం

ప్రియమణి.ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి టాప్ హీరోయిన్.

ఈమె అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వరించింది.

ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ భామ ఆ తర్వాత నెమ్మదిగా సినిమా పరిశ్రమకు దూరం అయ్యింది.

సినిమా పరిశ్రమలో తను ఎంతో స్ట్రగుల్ చేసింది.సమస్యలను ఎదుర్కొని, ఎదుర్కొని రాటుదేలింది.

కూలిపోయిన కెరీర్ గోడను మళ్లీ జాగ్రత్తగా పేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగానే భామా కలాపం అనే సినిమా చేసింది.

Advertisement

ఓటీటీలో స్ట్రీమ్ అయిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే తన సినీ కెరీర్ లో ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మడు సొంత రాష్ట్ర మాత్రం కేరళ.పాలక్కాడ్ ఫ్యామిలీ.2003లో ఎవరే అతగాడు అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది.ఎక్కువ తెలుగు సినిమాలే ఆమెకు మంచి పేరు తెచ్చాయి.2006లో పరుత్తి వీరనే అనే సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు దక్కించుకుంది.2007లో జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో తను హీరోయిన్ గా చేసింది.మంచి అందం, అంతకు మించి నటన ఉన్నా.

కెరీర్ ను బలంగా నిర్మించుకోలేకపోయింది.పాత్రల ఎంపికలో పొరపాట్ల మూలంగా కెరీర్ లో వెనకబడింది.

ఆ తర్వాత ముస్తఫా రాజ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షోకు జడ్జిగా చేస్తోంది.

Advertisement

అటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది ప్రియమణి.ఇండస్ట్రీ నుంచి కనుమరుగు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, సీరియళ్లు వస్తున్నాయి.అత్త, అమ్మ, వదిన పాత్రలతో కాకుండా కాస్త ప్రయారిటీ ఉన్న పాత్రలకు ఓకే చెప్తుంది.

గతంలో వచ్చిన నారప్ప, ప్రస్తుత భామాకలాపం, త్వరలో రానున్న విరాటపర్వం సినిమాలోనూ ఇలాగే నటిస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా ప్రియమణి మళ్లీ తన కెరీర్ ను చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

తాజా వార్తలు