రామ్ కు జంటగా ప్రియా ప్రకాష్ వారియర్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.

ఈయన దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తర్వాత తన నటనతో, డాన్స్ తో మంచి విజయాలను నమోదు చేసుకుని తన కంటూ ఒక గుర్తింపు సంపాదించు కున్నాడు.

పూరీ జగన్నాథ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ సాధించి రామ్ కు మాస్ లో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది.అప్పటి వరకు లవర్ బాయ్ పాత్రలను చేసిన రామ్ ఆ సినిమాతో మాస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత రెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు.

కానీ రామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతుంది.ఈ సినిమా ద్వారా రామ్ తమిళంలో పరిచయం అవ్వబోతుంటే లింగుస్వామి మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ కు జంటగా కృతి శెట్టి నటించబోతుంది.ఈ సినిమా తర్వాత రామ్ మరొక సినిమా కు ఓకే చెప్పినట్టు టాక్.రామ్ తర్వాత సినిమా మారుతీ దర్శకత్వంలో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

మారుతీ ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రామ్ తో సినిమా ఉండబోతున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటించబోతుందని ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి.ఈ మధ్యే వచ్చిన నితిన్ చెక్ సినిమాలో ప్రియా కనిపించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి

ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

Advertisement

తాజా వార్తలు