విషం చిమ్ముతున్న ప్రైవేట్ కంపెనీ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం అక్కన్న మాదన్న దేవాలయం పక్కనే ఉన్న ఎక్స్ టెక్ ప్రోలైస్ ప్రైవేట్ కంపెనీ నిత్యం తీవ్ర విష వాయువులు విడుదల చేస్తుందని ప్రజలు,భక్తులు ఆందోళన చెందుతున్నారు.

విష వాయువులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సదరు ప్రైవేట్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు,పక్కనున్న గ్రామపంచాయతీ వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విష వాయువులు విడుదల చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience

Latest Video Uploads News