వైసీపీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.సీఎం జగన్ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
99 శాతం పథకాలను ప్రజలకు అందజేశామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.హిందూపురంలో బాలకృష్ణ చేసిందేమీ లేదని చెప్పారు.
రెండుసార్లు గెలిచినా బాలయ్య ఏమీ చేయలేదని విమర్శించారు.హిందూపురంలో వైసీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కుప్పంలో వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయన్న ఆయన చంద్రబాబుకు అభ్యర్థులే లేరని తెలిపారు.