గుజరాత్‌లోని( Gujarat ) భరూచ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.వారానికి ఒకసారి జరిగే మీటింగ్ సమయంలో మాటామాటా పెరిగి, పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్( Principal Hitendra Singh Thakur ) కేవలం ఒక్క నిమిషంలో స్కూల్ లో పని చేస్తున్న ఉపాద్యాయుడిపై( Teacher ) 18 సార్లు దాడి చేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లి, దర్యాప్తు ప్రారంభమైంది.
వివరాల్లోకి వెళితే, గణిత, విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడైన రాజేంద్ర పర్మార్( Rajendra Parmar ) బోధనా విధానం పై విద్యార్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని ప్రిన్సిపాల్ ఠాకూర్ తెలిపారు.అంతేకాదు, పర్మార్ తరగతి సమయంలో అనుచితమైన పదజాలం ఉపయోగించారని కూడా ఆరోపించారు.ఈ విషయాన్ని మీటింగ్‌లో ప్రస్తావించినప్పుడు, పర్మార్ ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు.
ఘటన పై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.పర్మార్ విద్యార్థులను పాఠశాలలో అనుచితంగా ప్రవర్తన చేయిస్తున్నారని, వారు పర్మార్ కాళ్లను నొక్కే పని చేయించేవారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై పర్మార్ ప్రతిస్పందిస్తూ అవమానకరంగా మాట్లాడారు.దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్, తన సీటు నుంచి లేచి పర్మార్‌కు ఒక నిమిషంలోనే వరుసగా 18 సార్లు గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో ఈ ఘటన విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది.పర్మార్ పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదు చేయగా జిల్లా విద్యాధికారి స్వాతి రౌల్ ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించారు.సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.దానితో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందించిన అనంతరం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన నియంత్రణలు అవసరమని నెటిజన్లను ఆలోచనకు గురిచేస్తోంది.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.