ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14)( Valentine’s Day ) దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రేమకు సంబంధించిన సంఘటనలు, విడ్డూరమైన ప్రపోజల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే, ప్రేమను వ్యక్తపరచడంలో కొందరు హద్దు మీరిన చర్యలకు పాల్పడతారు.
తాజాగా యూపీలో జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా మారింది.అమ్రోహా జిల్లా( Amroha ) గజ్రౌలాలో ఓ యువకుడు చేసిన ప్రపోజల్ సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమవుతోంది.
ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం, ఓ యువకుడు తన కారులో యువతి వద్దకు వెళ్లి చేతిలో కేక్ ( Cake ) తీసుకొచ్చాడు.
ఆమెను ప్రెజెంట్ చేసే కేక్ తినిపించేందుకు ప్రయత్నిస్తూ ప్రేమను వ్యక్తం చేయాలని భావించాడు.అయితే, ఆమె కేక్ తినడానికి నిరాకరించింది.కేక్ తినకుండా పక్కకు తిప్పిన ఆమె.ఆపై ప్రపోజల్‌కు( Proposal ) కూడా అంగీకరించలేదు.ఈ నిరాకరణతో యువకుడు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు.కేక్ బాక్సును యువతిపై విసరడంతో పాటు ఆమెపై బూతులు తిట్టాడు.ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో యువతి కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ తర్వాత తన తీరును తెలుసుకున్న యువకుడు తిరిగి ఆమె దగ్గరకు వెళ్లి, తలపై పడిన కేక్‌ను తుడిచాడు.కానీ ఆగ్రహాన్ని పూర్తిగా అణగదొక్కుకోలేకపోయిన అతను కోపంగా తన కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral Video ) అవుతుండగా.
వీడియోపై నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.

ప్రేమ అంటే ఎదుటివారి భావాలను గౌరవించడం కూడా నేర్చుకోవాలని కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరు ‘ప్రేమను బలవంతంగా పొందడం తగదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి సంఘటనలు ప్రేమను దుర్వినియోగం చేయడంపై ఆలోచన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
‘‘సహనమే మనిషి గొప్పతనం’’ అన్న సూత్రాన్ని అందరూ పాటిస్తే ప్రేమ నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది.







