మంచి అమ్మకందారు

అమ్మకందారు అంటే విక్రేత.అమ్మకాలు, కొనుగోళ్లు ఎవరు చేస్తారు? వ్యాపారులే కదా.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ కోవకు చెందినవాడేనని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.మోదీ మంచి అమ్మకందారు.

మాటకారి.ఈ విషయంలో నాకెంటే ఆయనే మెరుగు అని వాఖ్యానించారు.

మంచి ఈవెంట్‌ మేనేజర్‌ అని కూడా అన్నారు.ఏదైనా కార్యక్రమాన్ని చక్కగా, మంచి ప్లాన్‌తో నిర్వహించేవారిని ఈవెంట్‌ మేనేజర్లు అంటారు కదా.ఇప్పుడు దీన్ని ఒక కోర్సుగా విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు కూడా.మన్మోహన్‌ సింగ్‌ చెప్పినదాంట్లో అవాస్తవం ఏమీ లేదు.

ఇది మోదీపై విమర్శ అయినా సరిగ్గానే చెప్పారు.ప్రధాని మోదీ గుజరాతీ.

Advertisement

వ్యాపారం అనేది వారి రక్తంలోనే ఉంటుంది.మరి వ్యాపారి ఎలా ఉండాలి? మాటకారిగా ఉండాలి.పదిమందినీ తన మాటలతో ఆకర్షించాలి.

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా వ్యాపారంలో భాగమే.ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే మన్మోహన్‌ తన ఎన్నికల ప్రచార సభలను విభిన్నంగా నిర్వహించారు.

ఆధునిక టెక్నాలజీ వాడారు.ఎన్నికల ప్రచారం కావొచ్చు, విదేశీ పర్యటనలే కావొచ్చు.

ఏదైనా సరే పక్కా ప్లాన్‌తో నిర్వహిస్తారు.ఇందుకోసం మోదీకి ప్రత్యేకంగా బృందమే ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

అంటే ఆయన కార్యక్రమాలను ఇతర పార్టీల మాదిరిగా నాయకులు ప్లాన్‌ చేయరు.వారూ ఉంటారుగాని నిపుణులు చెప్పినట్లే చేస్తారు.

Advertisement

అందుకే విదేశాల్లోనూ ఆయన ఇండియాలో మాదిరిగా బహిరంగ సభలు నిర్వహించారు.తన మాటల చాతుర్యంతో అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు.

మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు నిమిత్తమాత్రుడిగా ఉన్నారు.ఏ విషయంలోనూ ఆయన పాత్ర ఏమీ ఉండేది కాదు.

చివరకు అసమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు.

తాజా వార్తలు