గతంతో పోలిస్తే ఈ మారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయం లో మన ప్రియతమ ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్దాసక్తులు కనబరచిన తీరుతెన్నులు ఎంతైనా హర్షణీయం.ముఖ్యంగా కనివినీ ఎరుగని విధంగా గతం లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నడూ జరుగని రీతిలో ఈ భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు విచ్చేసిన ఈ ప్రతిష్టాత్మక సభలో మోడీ ప్రసంగిస్తూ వేయేళ్ల క్రితమే ప్రధాన వాణిజ్య కూడలిగా ఈ సాగర నగరి విశాఖ తన ప్రత్యేకతను చాటుకుందని ఇక్కడి ఓడరేవు నుంచి పచ్చిమాసియా, రోమ్ కు ఎగుమతులు జరిగాయని, రక్షణ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో విశాఖ కీలక పాత్ర పోషించింది అని మోడీ విశాఖ నగర గొప్పతనాన్ని ఈ సందర్బంగా ఊటంకించిన తీరు ఎంతైనా అభినందనీయం.
అంతేకాదు దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యభూమిక పోషిస్తున్నాదని, ఇక్కడి మౌలిక సదుపాయల అభివృద్ధికి తాము తప్పకుండా సహకారం అందిస్తామని మోడీ గట్టిగా హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఎంతో సంతృప్తి చెంది వుంటారు అనడంలో సందేహం లేదు.అంతేగాకుండా అందరితో కలసి, మెలసి స్నేహపూర్వకంగా, సహృద్భావంతో మెలగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని మన ప్రధాని సెలవు ఇవ్వడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల, ఇక్కడి ప్రజల శక్తి, సామర్త్యాల పట్ల ఆయన ఎంతటి ఆశాభావంతో,దృఢ విశ్వాసంతో వున్నారో ఇట్టే ఊహించవచ్చు.
అంతేగాకుండా విశాఖ నగరంలోని రూ.10,742 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంఖుస్థాపన, ప్రారంభోస్సవాలు చేయడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమే.అంతేగాకుండా ఈ సందర్బంగా జగన్ కూడా ప్రసంగిస్తూ విభజన హామీల నుంచి పోలవరం, ప్రత్యేక హోదా వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ దాకా తాము చేసిన విజ్ఞప్తులు అన్నింటిని సానుకూలంగా పరిగణించి పెద్ద మనస్సు తో పరిష్కరించాలని సభ పూర్వకంగా మోడీని కోరడం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది అనడంలో సందేహం లేదు.ఇది ఇలా వుంటే మోడీ అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ 450 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంఖుస్థాపన చేయడం, విశాఖ -రాయ్ పూర్ 6 లైన్ల రహదారి పనులకు ప్రారంభోస్సవం చేయడం, రూ 211 కోట్లతో నిర్మించిన పాతపట్నం – నరసన్నపేట 2 లైన్ల రహదారి, రూ 2,917 కోట్లతో పూర్తి చేసిన ఓఎన్జీసియూ – ఫీల్డ్ అభివృద్ధి ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయడాన్ని రాష్ట్రం వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా అభివృద్ధిలో శర వేగంగా దూసుకుపోవడం తథ్యం.

ఏదిఏమైన ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతున్న ప్రత్యేక సీఎం జగనన్న అంకుటిత దీక్ష, దృఢ చిత్తం వెరసి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మారుపేరుగా, దేశంలోనే అభివృద్ధి విషయం లో ఒక స్ఫూర్తిదాయకమైన, ఆదర్శమైన రాష్ట్రంగా నిలువడం తథ్యం.ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోగా మన భారతదేశం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, యావత్ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని, విశాఖలో రూ 10,742 కోట్లతో చెపట్టిన ఏడు ప్రాజెక్టులు నగర అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ పురోగతికి దోహదం చేస్తాయని ఆయన ఇచ్చిన భరోసా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎనలేని సంతృప్తిని ఇచ్చింది అనడంలో సందేహం లేదు.అంతేకాదు మన ప్రధాని గత ఆంధ్రప్రదేశ్ పర్యటన తో పోలిస్తే ఈ మారు మాత్రం ఆయన పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓక పండుగలాగా,ఒక సరికొత్త ఆశలతో, ఆకాంక్షలతో జరిగిపోయింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.