ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలుస్తోంది.
రేపు సాయంత్రం 4.15 గంటలకు రాజ్ కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.అనంతరం సింధుదుర్గ్ లో జరిగే ‘ నేవీ డే -2023’ ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.