రేపు మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన
TeluguStop.com
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలుస్తోంది.
రేపు సాయంత్రం 4.15 గంటలకు రాజ్ కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
అనంతరం సింధుదుర్గ్ లో జరిగే ‘ నేవీ డే -2023’ ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.