Prime Minister Modi CM YS Jagan :ఈనెల 11వ తారీఖు విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ..!!

ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది.ఈనెల 11వ తారీకు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకి చేరుకోనున్నారు.

గవర్నర్ బిశ్వ భూషణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు.ఆ తర్వాత 12వ తారీకు ప్రధాని మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.₹436 కోట్లతో విశాఖ రైల్వే జోన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, హెచ్పిసిఎల్ ఆదినికీకరణ, విస్తరణ ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యి 8.33 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి ఏడాదికి 15 ఏంటిపిఏకు విస్తరణ జరిగిన నేపథ్యంలో దాన్ని జాతికి అంకితం చేయనున్నారు.

ఆ తర్వాత ఆనందపురం మండలం గంభీరంలో ఐఏఎం భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం. వైసీపీ ఒకవైపు విశాఖ పరిపాలన రాజధాని అంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న  పరిస్థితిలో.

అదే ప్రాంతంలో కొన్ని పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తూ ఉండటం విశేషం.ఇదే సందర్భంలో విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసుల కళ అయిన రైల్వే జోన్ ఎట్టకేలకు సహకారం అవుతూ ఉండటం కూడా నిజంగా సంతోషించదగ్గ విషయమని చాలామంది అంటున్నారు.

Advertisement
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

తాజా వార్తలు