తీగ జాతి కూరగాయలను( Vine Vegetables ) పాలిహౌస్, మల్చింగ్, బిందు సేద్య పద్ధతి, పందిర్లు వంటి ఆధునిక పద్ధతులను అవలంబించి సాగు చేస్తే.పంటను వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు( Pests ) ఆశించకుండా అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.
అలా కాకుండా సాధారణ పద్ధతిలో సాగు చేస్తే చీడపీడలు, తెగుళ్లు పంటకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.తీగజాతి కూరగాయలకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో బంక తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
గత మూడు సంవత్సరాల నుండి ఈ బంక తెగుల తీవ్రత కూరగాయల పంటలపై అధికంగా ఉంది.

బంక తెగులు( Gummy Stem Blight ) డిడిమెల్ల బ్రయోనియే అనే శిలింద్రం వల్ల సోకుతుంది.అధిక తేమతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులలో బంక తెగులు పంటను ఆశిస్తుంది.మొక్కలోని వేర్లు తప్ప మిగతా అన్ని భాగాలపై ఈ తెగులు ప్రభావం చూపుతుంది.
విత్తనం మొలకెత్తి పంట కోత వరకు అన్ని దశలలో ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.ఈ బంక తెగులను ఎలా గుర్తించాలంటే.మొక్క కాండంపై చిన్న చిన్న గోధుమ రంగులు మచ్చలు ఏర్పడిన, ఒక్క నుండి ఎర్రని బంక లాంటి పదార్థం బయటకు వచ్చిన ఆ మొక్కకు బంక తెగులు ఆశించినట్టే.

తెగులు సోకిన మొక్కలు నాలుగు వారాల వ్యవధిలో వడలిపోవడం జరుగుతుంది.ఈ తెగులు విత్తనం ద్వారా సంక్రమించే అవకాశం కూడా ఉంది.కాబట్టి ఒక కిలో విత్తనాలను మ్యాంకోజెబ్ 2.5 గ్రా ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.నారుదశలో కూడా ఈ తెగులు పంటను ఆశిస్తాయి కాబట్టి ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.ప్రధాన పంట పొలంలో ఈ తెగులు కనిపిస్తే ఒక లీటర్ నీటిలో క్లోరోథలోనిల్ 1.5 గ్రా ను కలిపి పిచికారి చేయాలి.







