దేశాధినేత గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా దాదాపు రోజూ వార్తలలో నిలుస్తూనే ఉన్న వ్యక్తి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి.ఆయన దేశాధినేతగా ఎన్నికైనప్పటి నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలతో వివాదాస్పద చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా జపాన్ లో నాలుగు రోజుల పర్యటనకు వెళ్లిన ఆయన అసభ్యకరంగా ప్రవర్తించి ఆయన మరోసారి వార్తల్లో కెక్కారు.ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి హోదాలో జపాన్ లో నాలుగు రోజుల పర్యటనకు వెళ్లిన ఆయన టూర్‌లో భాగంగా ఆయన పిలఫ్పీన్స్ వాసులతో టోక్యోలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంలో ఆయన మితి మీరి ప్రవర్తించారు.తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వాలంటీర్లను వేదికకు దగ్గరలో కూర్చోబెట్టాలని నిర్వాహకులను కోరారు.
స్టేజి ఎక్కడమే అలస్యం ఓ మహిళా వాలింటర్ దగ్గరకు వెళ్ళి ముద్దాడాడు.ఈ సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడింది.

ఆ స్త్రీ పెదాలపై ముద్దు పెడుతుండగా ఆమె వద్దని చెప్పింది.దీంతో ఆయన చెంపలపై ముద్దుపెట్టుకొని పంపించారు.మిగతా వాలింటర్స్‌ను కూడా ఇలానే ముద్దు పెట్టి అక్కడి నుంచి పంపించారు.తర్వాత వేదికపై నుంచి మాట్లాడుతూ ‘‘నేను సాధారణంగా ముద్దులు పెదవులపైనే పెడతాను .కానీ ఈ కార్యక్రమంలో నన్ను నపుంసకుడుని కాకుండా ఈ మహిళలు కాపాడారు”.అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
అంతటితో అగకుండా తన ప్రత్యర్ధి సెనెటర్ ఆంటోనియోను “హోమో”గా విమర్శించారు.ఆయన ప్రసంగాన్ని వింటున్నవారికి ఈ మాటలు అసహ్యంగా అనిపించాయి.
ఈ తతంగం అంతా కూడా ఆయనగారి భార్య ఎదుటే చేయడం గమనార్హం.