ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేత యనమల తెలిపారు.ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదన్న ఆయన దమ్ముంటే రాష్ట్ర ఆర్థికస్థితిపై చర్చకు రావాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలోని సహజ వనరులు లూటీ అవుతున్నాయని యనమల ఆరోపించారు.పరిశ్రమలు అన్ని జగన్ అనుచరులకు, బంధువులకు పరిమితమవుతున్నాయన్నారు.టీడీపీ హయాంలో రూ.1.86 లక్షల కోట్లు అప్పు చేస్తే నాలుగేళ్ల కాలంలో వైసీపీ చేసిన అప్పు రూ.7 లక్షల కోట్లని తెలిపారు.అప్పుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.