హనుమంతుని ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రం తప్పనిసరి..!

మనం ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా అక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది.

వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించిన ఆంజనేయుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి భయాందోళనలు లేకుండా ఉంటామని భావిస్తారు.

స్వామివారిని బలానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు.అదేవిధంగా రామాయణంలో ఆంజనేయస్వామి పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామి వారిని దర్శించిన వారికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా అభయం కలుగుతుందని భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళిన ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము.

అయితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణల విషయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.చాలామంది ఆలయానికి వెళ్లిన తర్వాత మూడు ప్రదక్షిణలు చేసి ఆలయంలోని స్వామివారి దర్శనానికి వెళ్తారు.

Advertisement

నిజానికి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి.ఈ విధంగా స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో తప్పనిసరిగా భక్తులుశ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి.

ఇలా ప్రదక్షిణల అనంతరం ఆలయంలోకి వెళ్లి నేరుగా మహిళలు స్వామివారికి పూజలు చేయకూడదు.మన పూజా సామాగ్రిని పండితులకు అందించి పూజ చేయించాలి.స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులు ఎర్రటి మందారాలు, తమలపాకులు, తులసిమాలను తీసుకువెళ్లడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళిన భక్తులు ఎప్పుడూ కూడా స్వామి వారి పాదాలను తాకి నమస్కరించకూడదు.అలా తాకడం వల్ల ఎన్నో భూత ప్రేత పిశాచాల ఆవాహనం మనకు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఎందుకంటే అలాంటి భూత ప్రేత పిశాచాలను ఆంజనేయస్వామి తన పాదాల కింద అనిచి ఉంటాడు కనుక మనం పాదాలను తాకుతూ నమస్కరించ కూడదని పండితులు చెబుతున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు