తన డ్రెస్ పై కామెంట్స్ చేసిన వారిపై ప్రియాంక కౌంటర్

గ్లోబల్ నటి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకచోప్రా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యింది.

అక్కడ పెద్ద పెద్ద సినిమాలలో హీరోయిన్ గా తన ప్రస్తానం కొనసాగిస్తుంది.

హాలీవుడ్ నటుడు నిక్కి జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ పూర్తిగా విదేశీ వనితలా మారిపోయింది అనే విమర్శ చాలా కాలంగా వినిపిస్తుంది.దీనికి నిదర్శనంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ లో చాలా మంది ఎత్తి చూపిస్తున్నారు.

ఈ మధ్య గ్రామీ అవార్డు ఫంక్షన్ కోసం ప్రియాంకా చోప్రా ఒక డ్రెస్ వేసింది.ఈ డ్రెస్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

ఇంత దరిద్రమైన డ్రెస్సులు ఇంకెవరు వేయరనే విధంగా విమర్శలు చేశారు.భారతీయ సంప్రదాయాన్ని పూర్తిగా మంటగలిపింది అంటూ కామెంట్స్ చేశారు.

Advertisement

ఇలా విమర్శించిన అందరికి తాజాగా ప్రియాంకా చోప్రా సమాధానం ఇచ్చింది.గ్రామీ అవార్డుల వేడుక కోసం నేను ధరించిన డ్రెస్‌పై చాలా ట్రోలింగ్ జరిగింది.

అందరూ అనుకుంటున్నట్టు నేను అందాలు ఆరబోయలేదు.స్కిన్ కలర్‌లో ఉండే ఒకరకమైన క్లాత్ వేసుకుని దానిపై క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను.

అది ఎవరికీ తెలియదు.కెమేరాలు కూడా కనిపెట్టలేవు.

వేసుకున్న డ్రెస్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వస్తానని ప్రియాంక అసలు విషయాన్ని వెల్లడించింది.అయితే ప్రియాంకా ఇదంతా కేవలం తన మీద జరిగిన ట్రోలింగ్ ని తప్పించుకోవడానికి ఆడుతున్న మాటలు తప్ప అందులో వాస్తవం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?
Advertisement

తాజా వార్తలు