తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు.అందులో చాలా మంది వరుస సినిమాలు చేస్తూ హీరోలను స్టార్ హీరోలుగా మార్చుతూ వచ్చారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) కూడా ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసే ప్రతి సినిమాలో వైవిధ్యం అయితే మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు.ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే…
ఇక దీనికి సిక్వెల్ గా 2025 సంక్రాంతి బరిలో జై హనుమాన్( Jai Hanuman ) అనే సినిమాను నిలుపుతానని ప్రశాంత్ వర్మ మాట ఇచ్చాడు.ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక “శ్రీరామనవమి”( Sri Rama Navami ) సందర్భంగా ఇవాళ్ళ తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు.అదేంటి అంటే “హనుమాన్ సినిమాని ఎంతలా అయితే ఆదరించారో దానికి మించి జై హనుమాన్ సినిమా ఉండబోతుంది మీరందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది” అంటూ ప్రేక్షకుల్లో ఒక మంచి ఉత్సాహాన్ని నింపుతూనే ఈ సినిమా కు సంభందించిన హనుమంతుడు రాముడికి మాట ఇచ్చే ఫోటోను హైలెట్ చేస్తూ ఒక పోస్టర్ ను వదిలాడు.
ఇక హనుమంతుడి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది అనేది…
.