కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం బై ప్రశాంత్ కిషోర్ ! 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా బలహీన పడింది.

  బీజేపీ పరిస్థితి చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం తోపాటు , అధికారంలోకి రావడం  కష్టమే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారంలోకి వస్తున్నాయి.ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక పార్టీలు విజయం సాధించాయి.

దీనికితోడు గత కొంత కాలంగా ఎప్పుడు ఎదుర్కోలేని అంత ప్రజావ్యతిరేకత బీజేపీ ఎదుర్కొంటోంది.ధరలు అదుపులో లేకపోవడం, రెండో దశ కరోనాను కంట్రోల్ చేయ లేక పూర్తి భారం రాష్ట్రాలపై వేయడం, ఇప్పటికీ కరోనాను కట్టడి చేసే విషయంలో కేంద్రం సరైన చర్యలు తీసుకోలేక పోవడం, ఇలా ఎన్నో అంశాలు బీజేపీ గ్రాఫ్ తగ్గిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి.మమత బెనర్జీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు, జగన్ ,తమిళనాడు సీఎం స్టాలిన్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలామంది థర్డ్ ఫ్రంట్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నారు.

Advertisement

ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కాస్త మొహమాట పడుతున్నా, మిగతా ముఖ్య మంత్రులు మాత్రం థర్డ్ ఫ్రంట్ ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలోపేతమై, అధికారంలోకి రావాలని చూస్తున్నారు.అయితే ఇదంతా ఆషామాషీగా జరిగే వ్యవహారం కాకపోవడంతో, ఇప్పుడు ఆ బాధ్యత మొత్తం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.

మమతా బెనర్జీకి విజయాన్ని తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు.అలాగే తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించిన ప్రతి పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల కూటమి కూడా ప్రశాంత్ కిషోర్ గైడెన్స్ లోనే.

 ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలు తమకు తోచిన విధంగా థర్డ్ ఫ్రంట్ లో యాక్టివ్ గా ఉండగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయట.ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ సైతం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి వారందరినీ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనదైన శైలిలో .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు