2019 ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం కృషి ఎంతో ఉంది .అనేక సందర్భాల్లో వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ( AP cm jagan )కూడా ప్రశాంత్ కిషోర్ పై అనేక ప్రశంసలు కురిపించారు.
ఇప్పటికే ఆయనతో సన్నిహిత సంబంధాలే జగన్ కొనసాగిస్తున్నారు .ఇక ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఇప్పటికీ వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) శిష్యుడు రిషి రాజ్ వైసిపి వ్యూహకర్త గా పనిచేస్తున్నారు.
![Telugu Ap, Jagan, Janasena, Jansuraj, Telugudesam-Politics Telugu Ap, Jagan, Janasena, Jansuraj, Telugudesam-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/telugudesam-AP-government-Prasanth-Kishore-pk-jansuraj-party-Jagan-AP-government.jpg)
ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ప్రశాంత్ కిషోర్ కు( Prasanth Kishore ) సంబంధించిన ఓ వార్త ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించబోతున్నారని , ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారని , ఆ సందర్భంగా టిడిపికి స్వచ్ఛందంగా రాజకీయ వ్యూహాలు అందిస్తానని ప్రశాంత్ కిషోర్ ముందుకు వచ్చారని, దీనికి టిడిపి అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం తెరపైకి వచ్చింది.ఇక మీడియా, సోషల్ మీడియాలోనూ టిడిపికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందించబోతున్నారనే ప్రచారం ఉదృతం అయ్యింది.
దీంతో జనాల్లోనూ టిడిపికి ( TDP )ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాలు అందిస్తున్నారని, జగన్ కు ఆయన దూరమయ్యారనే అభిప్రాయాలు కలుగుతున్న నేపథ్యంలో , అసలు విషయం బయటకు వచ్చింది.
![Telugu Ap, Jagan, Janasena, Jansuraj, Telugudesam-Politics Telugu Ap, Jagan, Janasena, Jansuraj, Telugudesam-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/Prasanth-Kishore-TDP-Nara-Lokesh-janasena-telugudesam-AP-government-Prasanth-Kishore.jpg)
ప్రశాంత్ కిషోర్ టిడిపికి రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు అనేది పూర్తిగా తప్పుడు ప్రచారం అనే విషయం తేలింది .ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ బిజీ బిజీగా ఉన్నారు.గతంలోనే ఆయన ఐ ప్యాక్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగారు.
జన సురాజ్ పేరుతో బీహార్ లో రాజకీయ వేదికను నిర్మించారు .బీహార్ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ ( Prasanth Kishore )పర్యటనలు , పాదయాత్రలతో బిజీబిజీగా ఉన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి ఆయన స్వయంగా రాజకీయ వ్యూహాలు అందించే అంత తీరిక లేదు.అయినా టిడిపికి వ్యూహాలు అందించబోతున్నారు అనేది కేవలం ప్రచారం మాత్రమేనని ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతే కాకుండా జగన్ తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపికి అనుకూలంగా రాజకీయ వ్యూహాలు అందించరు అని, , వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటమి భయం ఉండడంతోనే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతుందని, అయినా గెలుపు పై నమ్మకం లేక ఈ విధంగా అసత్య ప్రచారాలకు దిగుతూ, జనాలను కన్ఫ్యూజ్ చేసి అంతిమంగా లాభ పడాలనే ఆలోచనకు తెరతీసిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.