భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి ఒకరు.నటిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అన్ని భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన ఈమె అర్ధాంతరంగా మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఇక శ్రీదేవి( Sridevi ) మరణం తర్వాత తన కుమార్తెలు ఇండస్ట్రీకి వారసురాలుగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ ( NTR ) హీరోగా నటిస్తున్న దేవర (Devara) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.కెరియర్ మొదట్లో అమ్మను నేను చాలా దూరం పెట్టానని అయితే ఇప్పుడు ఎందుకు అంత పిచ్చి పని చేశానా అని బాధపడుతున్నాను అంటూ ఈమె తెలియజేశారు.
ధడక్ సినిమా( Dhadak ) కమిట్ అయిన సమయంలో శ్రీదేవి ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సమయంలో తన తల్లి తనతో పాటు షూటింగ్ లోకేషన్ కి వస్తాను అని చెప్పినప్పటికీ ఈమె తనని దూరం పెట్టారట.

శ్రీదేవి కూతురిగా నేను షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఎంతో అభద్రత భావానికి గురి అయ్యేదాన్ని శ్రీదేవి కూతురిలా కాకుండా తనని తాను నిరూపించుకోవడం కోసం సినిమాలకు సంబంధించిన ఎలాంటి సలహాలు కూడా అమ్మ నుంచి తీసుకోలేదు.ఆ సమయంలో అమ్మను తాను పూర్తిగా దూరం పెట్టానని కానీ ఇప్పుడు అమ్మతో సమయం గడపాలని తనని షూటింగ్ కి తీసుకువెళ్లాలని అలాగే సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అమ్మని అడిగి తెలుసుకోవాలని ఉంది అంటూ ఈమె ఎంతో ఎమోషనల్ అయ్యారు.







