రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేలా కృషి చేయడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో ఉంది.
తనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ ద్వారా ఎప్పటికప్పుడు రాజకీయ సర్వేలు నిర్వహిస్తూ, తమతో ఒప్పందం చేసుకున్న పార్టీలు గెలిచే విధంగా వ్యూహాలు పన్నుతూ ఉంటారు.ఏపీలో వైసీపీ, తమిళనాడులో డిఎంకె, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇలా ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో ఒప్పందం చేసుకుంటే ఆ పార్టీ గెలిస్తే విధంగా వ్యూహాలు అందిస్తూ ఉంటారు.
కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల బిజెపి గెలవడం తో మరింత సీరియస్ గా దృష్టి సారించారు.
ఇదే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనూ నెలకొంది.ఒంటరిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోవడం కష్టం అనే అభిప్రాయానికి ఆ పార్టీ అగ్రనేతలు వచ్చేస్తారు .
ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల లోనూ ఇదే అభిప్రాయం ఉండడంతో, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనిపిస్తున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్ కు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీటిని ఏకం చేసే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది.2024 ఎన్నికల నాటికి బిజెపి కి ధీటుగా కాంగ్రెస్ ను బలోపేతం చేయడం, పార్టీలను ఏకం చేయడం వంటి విషయాలపై దృష్టి పెట్టారట.ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్, ప్రియాంక గాంధీ లతో చర్చించినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలలో మెజారిటీ పార్టీలు బిజెపిని వ్యతిరేకిస్తున్నాయి.దీంతో కాంగ్రెస్ కు వీరందరూ అండదండలు అందించడం సులువు అవుతుందనే లెక్కల్లో ప్రశాంత్ కిషోర్ ఉన్నారట.
అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ పై ఉన్న నమ్మకంతో ఆయన వ్యూహం ప్రకారం నడుచుకునేందుకు దాదాపు అంతా సిద్దమవుతుండటంతో కాంగ్రెస్ లోనూ ఈ పరిణామాల పై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం బీజేపీ అధికారంలో రాకుండా చేసేందుకు , కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఏపీ విషయంలోనే సందిగ్దత నెలకొంది.ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రాంతీయపార్టీల కూటమికి మద్దతు ఇచ్చేందుకు జగన్ ఒప్పుకోరు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతలంతా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నా, బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారితో జగన్ సన్నిహితంగా మెలుగుతున్నారు.అవసరమైన సందర్భాల్లో ఆ పార్టీకి మద్దతుగా నిలబడుతూ వస్తుండడంతో , ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనను జగన్ ఒప్పుకునే అవకాశం లేదు.
కానీ బిజెపి జనసేన టిడిపి పొత్తు ఎన్నికల నాటికి పెట్టుకుంటే కనుక బీజేపీపై జగన్ తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదు.