మన దేశంలో ఐఏఎస్ కావాలని కలలు కనే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే.కొంతమంది తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ కావాలనుకునే కలను నెరవేర్చుకుంటే మరి కొందరు చాలాసార్లు ప్రయత్నించి విజేతగా నిలుస్తారు.
కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా చిన్నచిన్న తప్పుల వల్ల ఐఏఎస్( IAS ) కావడంలో ఫెయిల్ అవుతుంటారు.అయితే ఒక యువతి మాత్రం 23 సంవత్సరాలకే ఐఏఎస్ కావడం గమనార్హం.
జమ్మూ కశ్మీర్( Jammu and Kashmir ) సరిహద్దు ప్రాంతమైన వూంచ్ కు చెందిన ప్రశంజీత్ కౌర్( Prashanjeet Kaur ) తాజాగా వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో 11వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకును సాధించి ప్రశంజీత్ కౌర్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
ప్రశంజీత్ కౌర్ తల్లి గృహిణి కాగా తండ్రి ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారు.

బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న ప్రశంజీత్ కౌర్ 2020 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశారు.2022 సంవత్సరంలో జమ్మూ యూనివర్సిటీలో ప్రశంజీత్ కౌర్ మాస్టర్స్ పూర్తి చేయడం గమనార్హం.ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ను మొదలుపెట్టిన ప్రశంజీత్ కౌర్ పీజీ పూర్తైన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉద్యోగం వచ్చినా సివిల్స్ కు ప్రాధాన్యత ఇచ్చి పట్టుదలతో చదివారు.

ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆమె సత్తా చాటారు.ఒక విషయం గురించి తక్కువగా చదివి ఎక్కువసేపు ఆలోచిస్తే పూర్తి పట్టు వస్తుందని ఆమె పేర్కొన్నారు.రోజుకు ఎనిమిది గంటల పాటు చదివి ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఆమె సత్తా చాటారు.ఇంటర్వ్యూను క్రాక్ చేస్తే మాత్రం ప్రశంజీత్ కౌర్ కల నెరవేరినట్టేనని చెప్పవచ్చు.
మనం లక్ష్యం ఎంత పెద్దదైతే అడ్డంకులు అంత ఎక్కువగా ఉంటాయని ఆమె కామెంట్లు చేశారు.







