కరోనాపై సినిమా తీస్తా అంటున్న ప్రశాంత్ వర్మ

అ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు ప్రశాంత్ వర్మ.

మొదటి సినిమాతో డిఫరెంట్ కంటెంట్ ని అద్బుతంగా ప్రెజెంట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ తర్వాత యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తో కల్కీ అనే సినిమా తెరకెక్కించాడు.

సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా పర్వాలేదనే టాక్ వచ్చిన కూడా రాజశేఖర్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడంతో సినిమాకి నష్టాలు వచ్చాయి.తర్వాత చాలా కాలంగా గ్యాప్ తీసుకొని అ కి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేసుకుంటున్న ఈ కుర్ర దర్శకుడు ఇప్పుడు కరోనా కాన్సెప్ట్ తో కొత్త కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

వైరస్ లని బేస్ చేసుకొని హాలీవుడ్ లో చాలా కథలు వచ్చాయి.అవి సూపర్ హిట్ కూడా అయ్యాయి.

అయితే ఇండియన్ భాషలలో చాలా తక్కువ సినిమాలు ఈ ఇలాంటి కథాంశాలతో వచ్చాయి.ఇప్పుడు డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఆలోచన ఈ కాన్సెప్ట్ మీద పడింది.

Advertisement

కరోనా నేపథ్యంలో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ లోనే ఆయన ఇలాంటి థీమ్ ఒకటి ప్లాన్ చేసారని సన్నిహితులు చెబుతున్నారు.

ఓ అప్ కమింగ్ హీరోతో ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్లాన్ చేసారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిందని తెలుస్తోంది.అయితేఈ సినిమాని రెగ్యులర్ జోనర్ లో కాకుండా కాస్తా భిన్నమైన ప్రెజెంటేషన్ లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు