విశాఖ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ.పాల్ కామెంట్స్…ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా వైద్యులు పరిక్షలు జరిపి నా ఆరోగ్యం బానే వుందన్నారు.కానీ త్రీటౌన్ సిఐ 20 మంది పోలీసులతో వచ్చి దీక్ష భగ్నం చేసి కాలు విరగిట్టారు.
ఆసుపత్రిలో నిన్న తనకు సైనైడో, లేదా మత్తుమందో ఇవ్వాలని చూశారు.ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ఖండించాలి.అదానీ నేరుగా జగన్ కాల్ చేసి ధీక్షను భగ్నం చేయించారనే అనుమానాలున్నాయి?జగన్ మీరు అదానీ తొత్తు కాదని నిరూపించుకోవాలి.ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దు.
నన్ను ఎన్ కౌంటర్ చేయిస్తారట.
నన్ను ఎత్తుకెళ్లడానికి హక్కు ఎక్కడుంది.
తనపై దాడికి పాల్పడ్డ సిఐ రామారావు, ఎస్ ఐ ని సస్పెండ్ చేయండి.లేదూ అంటే 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా వుంటాయి.
రాబోయే ఎన్నికల్లో వైసిపి ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను.పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలను.
ఏపి ఎమ్పీలు రాజీనమాలు చేయాలి.అలాచేస్తే 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఆపిస్తాను.
ప్రజాశాంతి పార్టీ తరపున పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తున్నాను.నాతో కలిసి పోటీ చేయు పవన్ , ప్యాకేజీలపై ఆశపడొద్దు.
విశాఖ ఎమ్.పీ గా పోటీ చేస్తాను.నేను స్ధానికుడిని, నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఓట్లే 2 లక్షల వరకూ వస్తాయి.