స్పెషల్ రోల్స్ కోసం దర్శకులకి గాళం వేస్తున్న కంచె భామ

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్.

మొదటి సినిమాతోనే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుందని అందరూ భావించారు.

అయితే దానికి విరుద్ధంగా అనుకున్న స్థాయిలో అవకాశాలు సొంతం చేసుకోలేకపోయింది.దీంతో తన అందాల గేట్లు తెరిచి తనలో గ్లామర్ ప్రదర్శన చేసిన కూడా ఈ భామని ఎవరూ పట్టించుకోలేదు.

అవకాశాలు వచ్చిన కూడా అవి పూర్తి స్థాయిలో తనని తాను ప్రూవ్ చేసుకునే విధంగా లేకపోవడం గమనార్హం. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ కి చివరికి ఈ అమ్మడుకి దిక్కు అయ్యాయి.

దీంతో వాటితోనే సరిపెట్టుకుంటూ వస్తుంది.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్ లతో అభిమానులకి ఆహ్లాదం అందిస్తుంది.

Advertisement

అయితే ఈ భామ తనలోని దాగి ఉన్న నిధులు అన్ని బహిర్గతం చేస్తూ అందాల ప్రదర్శన చేస్తున్నా కూడా ప్రగ్యాని కరుణించే దర్శకులే లేకుండా పోయారు.ఒకవేళ ఈమెని ఎవరైనా సంప్రదిస్తున్నా కూడా ఏదో ఐటెం సాంగ్ కోసం తప్ప హీరోయిన్ పాత్రలని ఎవరూ ఆఫర్ చేయడం లేదు.

తనలోని నటిని ఎవరూ గుర్తించడం లేదని ఈ అమ్మడు కూడా తన సన్నిహితుల దగ్గర భాగా ఫీల్ అవుతున్నట్లు బోగట్టా.దీంతో హీరోయిన్ పాత్రలు అంటూ మడికట్టుకోని కూర్చోకుండా సినిమాలలో ప్రత్యేక పాత్రల కోసం అయిన ప్రయత్నం చేయాలని ప్రగ్యా భావిస్తుంది.

అందులో భాగంగా ఆ దిశగా కూడా తనని తాను ప్రమోట్ చేసుకుంటూ దర్శకులని అవకాశాలు అడుగుతున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే తనని హీరోయిన్ గా పరిచయం చేసిన క్రిష్ మరల పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రని ప్రగ్యాకి ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

డ్యాన్స్ స్టెప్స్ విమర్శల గురించి స్పందించిన శేఖర్ మాస్టర్.. అలా చెప్పడంతో?
Advertisement

తాజా వార్తలు