నయనతార నా జీవితంలో నిప్పులు పోసింది.. తనని ఏ దేవుడు క్షమించడు?

లేడీ సూపర్ స్టార్ గా ఎత్తు మంచి పేరు సంపాదించుకున్న నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Prabhudeva Wife Fires On Heroine Nayanthara Details, Prabhu Devu, Wife, Nayantha-TeluguStop.com

ఈ విధంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నయనతార పట్ల నయనతార మాజీ ప్రియుడు ప్రభుదేవా భార్య లత( రామ్లాత్) గతంలో నయనతార పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నయనతార విగ్నేష్ కన్నా ముందుగా ప్రభుదేవాను ప్రేమించిన విషయం మనకు తెలిసిందే ఇక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుదేవా నయనతార పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారు.అయితే పలు మనస్పర్థల కారణంగా ప్రభుదేవా-నయనతార విడిపోయారు.ఈ విధంగా ప్రభుదేవా నుంచి విడిపోయిన నయనతార దర్శకుడు విగ్నేష్ ప్రేమలో పడ్డారు.తాజాగా నయనతార విగ్నేష్ ను చేసుకోవడంతో ప్రభుదేవా భార్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నయనతార తన భర్తను ప్రేమిస్తున్నట్లు నటించి తన భర్తను తన నుంచి దూరం చేసిందని ఆరోపించారు.ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నట్లు నటించి నా కాపురంలో నిప్పులు పోసిందని, తన బతుకు రోడ్డున పడటానికి నయనతార కారణం అయిందని ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Vignesh Shivan, Latha, Nayanthara, Prabhu Deva, Prabhu Devu-Movie

ప్రభు దేవా నన్ను దేవతల చూసుకునేవాడు.15 సంవత్సరాల పాటు తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉన్న మా జీవితాలలోకి నయనతార వచ్చి మా మధ్య చిచ్చు పెట్టిందని, తన భర్త ఆమె మాయలో పడి తనకు విడాకులు ఇచ్చారని లత పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.నన్ను ఇంతగా బాధ పెట్టిన నయనతారను ఏ దేవుడు కూడా క్షమించడు అంటూ ఈమె నయనతారపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.నయనతార పెళ్లి అయిన సందర్భంగా గతంలో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube